ఉత్సాహంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

జయపురం: జయపురం ఓరియన్‌ క్రికెట్‌ క్లబ్బు ఆధ్వర్యంలో మూడో ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉతాహంగా బుధవారం ప్రారంభమైంది. జయపురం దసరా మైదానం (జయపురం విక్రమ క్రీడా మైదానం)లో నిర్వహిస్తున్న టోర్నమెంటు ప్రారభంభానికి జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయపురంలో ఓరియన్‌ క్రికెట్‌ క్లబ్బు మూడేళ్లుగా జేసీఎల్‌–3వ లీగ్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు. కొరాపుట్‌ జిల్లా క్రికెట్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో జిల్లాకు పేరు తేవాలని పిలుపు నిచ్చారు. జయపురం సబ్‌డివిజన్‌ అథ్లటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రబి నాయిక్‌, బీజేడీ సీనియర్‌ నేత, క్రీడాభిమాని బాలా రాయ్‌, ప్రముఖ వ్యాపారులు సూర్యపట్నాయక్‌, క్రీడాకారుడు, సమాజ సేవకుడు సుభాష్‌ రౌత్‌, ఓరియన్‌ క్రికెట్‌ క్లబ్బు అధ్యక్షులు బాబులరౌత్‌లు వేదికను అలంకరించారు. బాబుల్‌ రౌత్‌ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా తాము ప్రీమియర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు టోర్నమెంట్‌ జరుగుతోందని వెల్లడించారు. ఈసారి ఛతీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కూడా క్రికెట్‌ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా క్రికెట్‌ జట్లను ఆహ్వానించి జీపీఎల్‌ పోటీలకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement