కన్నీటి చార ఆరక ముందే.. | - | Sakshi
Sakshi News home page

కన్నీటి చార ఆరక ముందే..

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

నరసన్నపేట: జమ్ము గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. వారం వ్యవధిలో తండ్రీకుమారులు కోల లక్ష్మణరావు, కోల శివప్రసాద్‌లు మృతి చెందారు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రమైంది. వారం కిందట కోల లక్ష్మణరావు కుమారుడు శివప్రసాద్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శివప్రసాద్‌ ద్విచక్రవాహనం విజయనగరం వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఇంటిని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పుట్టెడు దుఖంతో తండ్రి లక్ష్మణరావు కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అనారోగ్యానికి గురైన లక్ష్మణరావు జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుమారుడు మృతి నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే తండ్రి కూడా మరణించడంతో ఈ కుటుంబం దిక్కులేనిదైంది. శివప్రసాద్‌ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఇద్దరు సోదరీమణులకు వివాహాలు చేశాడు. ఇప్పుడు తండ్రీ కుమారులు ఇద్దరూ వారం వ్యవదిలో మరణించడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావ డం లేదు. కోల లక్ష్మణరావుకు భార్య సీతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement