భువనేశ్వర్: రాష్ట్రంలో వైద్య సేవా రంగంలో హై టె క్ మరో ముందడుగు వేసింది. పశ్చిమ ఒడిశా ప్రాంతీయులకు కేన్సర్ చికిత్స, వైద్య సేవలను చేరువ చేసింది. హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి రౌర్కెలా శా ఖ సముదాయంలో బినోదిని కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ దిలీప్ రే ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైద్య సేవా రంగంలో హై టెక్ సేవల్ని ఆయన కొనియాడారు. అత్యాధునిక పరిక రాలు, అనుభవజ్ఞులైన వైద్యులతో క్యాన్సర్ నిర్ధార ణ, చికిత్స సౌకర్యాలను అందించే బినోదిని ఆస్పత్రిని రౌర్కెలాలో స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల పశ్చిమ ఒడిశాతో పాటు పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి పరికరా లు, శస్త్ర చికిత్స సదుపాయాలు ఉన్నాయి. 250 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో సీనియర్, అనుభవజ్ఞులైన క్యాన్సర్ వైద్యుల నియామకం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హైటెక్ వ్యవస్థా పక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ పశ్చిమ ఒడిశా ప్రాంతంలో క్యాన్సర్ రోగులకు సమీపంలోనే తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. పశ్చిమ ఒడిశా రోగులతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు చెందిన రోగులు ఈ క్యాన్సర్ ఆస్పత్రిలో నాణ్యమైన చికిత్స ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణతో పాటు రోగులకు నిరంతర సంరక్షణను అందించనున్నట్లు హైటెక్ గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి తెలిపారు. కార్యక్రమానికి ట్రస్టీ పుష్పాంజలి పాణిగ్రాహి, పర్లాఖిముండి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, రౌర్కెలా హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి, మెడికల్ కాలేజ్ సీఈఓ డాక్టర్ సుశాంత్‌కుమార్ ఆచార్య, మెడికల్ కాలేజ్ చైర్మన్, వైద్యులు, అధికారులు హాజరయ్యారు.


