అంగరంగ వైభవోపేతంగా..
పూర్ణాహుతితో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
సోమవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో కాళేశ్వరాలయం వ్యూ
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. 14న శనివారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా ఉత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహించారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు బైకుంఠపాండా, రాముశర్మ, శ్రావణ్‌కుమార్, రామకృష్ణ, పవన్‌శర్మ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం
కాళేశ్వరం అనుబంధ దేవాలయమైన అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి మరుసటి రోజున ఆనవాయితీ ప్రకారం శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4గంటలకు ఆలయ వేదపండితులు కల్యాణ తంతును ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్‌రెడ్డి ఉన్నారు. అర్చకులు వెల్ది శరత్‌శ్‌చంద్రశర్మ, పాండా, పవన్‌శర్మ, రాధకృష్ణ, విజ య్‌కుమార్‌శర్మ, రిటైర్డు అర్చకులు పాల్గొన్నారు.
ఆదాయం రూ. 23.35లక్షలు
మూడు రోజులకు గాను కాళేశ్వరం దేవస్థానానికి వివిధ పూజలు, లడ్డు ప్రసాదాలు, తైబజార్ విక్రయాల ద్వారా రూ. 23.35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. మేడారం ఎఫెక్టుతో మూడు రోజుల్లో 60వేల మంది వరకు దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
దేవస్థానానికి రూ.23.35 లక్షల ఆదాయం
వైభవంగా ఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం
అంగరంగ వైభవోపేతంగా..
అంగరంగ వైభవోపేతంగా..
అంగరంగ వైభవోపేతంగా..


