కొవ్వొత్తులతో ర్యాలీ
చిట్యాల: నాగర్ కర్నూల్ జిల్లా బమ్మెరలో అగ్రవర్ణాల చేతిలో బలైన చిన్నారికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జాక్, రజక సంఘాలు మానవహారంతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు బుర్ర వెంకటేష్‌గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల అహంకారానికి అభం శుభం తెలియని చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తౌటం నవీన్, పుల్ల అశోక్, శీలపాక నాగరాజు, పుల్ల మల్లయ్య, పాండ్రాల వీరస్వామి, రవీందర్, కుమారస్వామి, కిరణ్, తిరుపతి, శశికుమార్, కిషన్ పాల్గొన్నారు.
రోడ్డుపై నిర్లక్ష్యం..
ప్రమాదానికి నెలవు!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇలా మోడువారి ప్రమాదానికి నెలవుగా ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వేసవి కాలంలో గాలిదుమారాలు వస్తే వాహనదారులపై పడే ప్రమాదం ఉంది. ప్రమాదం జరగకముందే మోడువారిన చెట్లను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ
మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను డీఐఈఓ వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ద్వితీయ సంవత్సరంలో 76 మంది విద్యార్థులకు గాను 75 మంది, ఒకేషనల్ కోర్సులో 27 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని చెప్పారు.
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి, మల్లూరు పుష్కరఘాట్ నిర్మాణం అంచనా నివేదికను మంత్రి సీతక్కకు గురువారం అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ తెలిపారు. ఇటీవల మంత్రి సీతక్కను హైదరాబాద్‌లో కలిసి హేమాచలక్షేత్రం అభివృద్ధి, మల్లూరులో పుష్కరఘాట్ ఏర్పాటుపై నివేదిక అందజేయగా సానుకూలంగా స్పందించిన సీతక్క కలెక్టర్‌తో మాట్లాడి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో అంచనా నివేదిక తయారు చేయాలని ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనులపై రూపొందించిన నివేదికను గురువారం మేడారంలో మంత్రి సీతక్కను కలిసి అందజేసినట్లు వెల్లడించారు.
కొవ్వొత్తులతో ర్యాలీ
కొవ్వొత్తులతో ర్యాలీ
కొవ్వొత్తులతో ర్యాలీ


