గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
కాళేశ్వరం: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. మహదేవపూర్ మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 9 గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీడీఓ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో వార్డు సభ్యుల విధులు, చేయాల్సిన కార్యక్రమాలు, నిధులు తదితర అంశాలపై వివరించారు. తహసీల్దార్ రామారావు, టీఓటీ కుమారస్వామి, మహదేవపూర్ సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్, రాణిబాయిరామారావు, ఆకుతోట సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు
వార్డుసభ్యులకు శిక్షణ తరగతులు


