అభివృద్ధి చేసేవారికే పట్టం
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీని అభివృద్ధి చేసేవారినే గెలిపించుకుంటామని, నీతి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని భూపాలపల్లి పట్టణ ప్రజలు స్పష్టం చేశారు. శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలతో భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల ఎజెండా–సమస్యలు–పరిష్కారాలపై చర్చావేదిక నిర్వహించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతోనే భూపాలపల్లిలో ప్రధాన సమస్యలు పరిష్కారామవుతాయని, మూడు కూడళ్లలో రహదారి విస్తరణ చేపట్టి, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డుల పరిధిలో 52,726 ఓటర్లు ఉన్నారు. చర్చావేదికలో పలువురు వెల్లడించిన సమస్యలు వారి మాటల్లోనే..
రహదారి విస్తరణ చేపట్టాలి
పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రతీ రోజు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతున్నాయి. చౌరస్తా చు ట్టూ నాలుగు వైపులా రహదారి విస్తరణ చేపట్టాలి. అంబేడ్కర్ చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్‌షెల్టర్ నిర్మాణం చేపట్టాలి.
–కొడపాక శంకర్, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు
సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
జయశంకర్ చౌరస్తా వద్ద రోడ్డు ఇరుకుగా ఉంది. సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా మాదిరిగానే అక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
– స్వామి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి
సింగరేణి కంపెనీలో 30 ఏళ్లకు పైగా పని చేసి రిటైర్డ్ అయిన వారు వందలాది మంది భూపాలపల్లిలో ఉన్నారు. వారందరి సౌకర్యార్థం సింగరేణి యాజమాన్యం ఒక కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలి.
– మారెపెల్లి రామస్వామి,
సింగరేణి రిటైర్డ్ కార్మికుడు
పార్కులో సౌకర్యాలు కల్పించాలి
జయశంకర్ పార్కును సింగరేణి, మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. పార్కులో ఓపెన్ జిమ్ మొత్తం మరమ్మతుకు గురైంది. సీసీ కెమెరాలు లేవు. దీంతో సాయంత్రం వేళల్లో మహిళలు పార్కుకు వచ్చేందుకు భయపడుతున్నారు. పాముల బెడద కూడా ఉంది. పార్కులో కనీసం తాగునీటి సౌకర్యం లేదు.
–అంబటి శంకర్, సింగరేణి కార్మికుడు
ర్యాష్ డ్రైవింగ్‌పై చర్యలు తీసుకోవాలి
యువకులు ప్రధాన రహదారితో పాటు చిన్నచిన్న వీధుల్లో సైతం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు, మహిళలు రోడ్డెక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. అలాగే చెత్త సేకరణ ట్రాక్టర్లు ప్రతీరోజు కాలనీలకు రావడం లేదు.
– కొండపర్తి శ్రీనివాస్, వ్యాపారి
బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి
జంక్షన్లను అభివృద్ధి చేయాలి
కోతులు, కుక్కల బెడద నివారించాలి
‘సాక్షి’ చర్చావేదికలో వాకర్స్
అసోసియేషన్ సభ్యులు
అభివృద్ధి చేసేవారికే పట్టం
అభివృద్ధి చేసేవారికే పట్టం
అభివృద్ధి చేసేవారికే పట్టం
అభివృద్ధి చేసేవారికే పట్టం
అభివృద్ధి చేసేవారికే పట్టం
అభివృద్ధి చేసేవారికే పట్టం


