కోటగుళ్లలో కట్టుదిట్టమైన భద్రత
గణపురం: ఈ నెల 15న కోటగుళ్లలో నిర్వహించే శివ కల్యాణ మహోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. గురువారం కోటగుళ్లను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఎస్పీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో సన్మానించారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భద్రత చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భూపాలపల్లి డీఎస్పీ అవిరినేని సంపత్ రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్‌ఐ రేఖ అశోక్ పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


