బాధితులకు భరోసా కల్పించాలి
మల్హర్ (మహాముత్తారం): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు, ఫిర్యాదుదారులకు భరోసా, నమ్ముకాన్ని కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మండలంలోని మహాముత్తారం (అడవి ముత్తారం) పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠ పెరిగేలా పనిచేయాలని సూచించారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతీ ఫిర్యాదుపై స్పందించి ప్రాథమిక విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. మధ్యవర్తులకు తావు కల్పించకూడదని సిబ్బందికి తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం అయినందున సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


