మహిళా శక్తి దేశాభివృద్ధికి పునాది
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: మహిళల శక్తి దేశాభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ ర్యాలీని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, యువతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


