ఇంటర్ పరీక్షలు షురూ
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులను తెలుగు పరీక్షను నిర్వహించారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. 1,829 వందల మంది విద్యార్థులకు గాను 1,772 వందల మంది హాజరు కాగా 57 మంది గైర్హాజరైనారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యానోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు.
ఇంటర్ పరీక్షలు షురూ


