కేసీఆర్‌కు శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు శుభాకాంక్షలు

Feb 18 2026 7:25 AM | Updated on Feb 18 2026 7:25 AM

కేసీఆ

కేసీఆర్‌కు శుభాకాంక్షలు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక వాహనాల తనిఖీ

భూపాలపల్లి: తెలంగాణ తొలి ముఖ్యమత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ జన్మదినం సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

20న జాబ్‌ మేళా

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి ఏరియాలో పనిచేసేందుకు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌ పోస్టుల నియమాకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంబీఏ, డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసి 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని అన్నారు. అర్హత, ఆసక్తిగల యువకులు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఇతర పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 97010 78288 నంబర్‌లో సంపద్రించాలని సూచించారు.

మున్సిపల్‌ చైర్మన్‌కు సన్మానం

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య గౌడ్‌ను మంగళవారం గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తని వెంకటేశ్వర్లు గౌడ్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వేముల సదానందం, నాయకులు బండి శ్రీనివాస్‌, బుర్ర కుమారస్వామి, పెసరు నాగరాజు పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌ను ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి బొనకంటి సుభాష్‌లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా స్వప్నకుమారి, రాజేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జె.రాజ్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శులుగా వెంకటరమణ, సదానందం, రాజేందర్‌, జిల్లా కోశాధికారిగా రాజేంద్రప్రసాద్‌, కమిటీ సభ్యులుగా రాజ్‌కుమార్‌, రాజశేఖర్‌, రాజు, మొగిలి, రాకేష్‌, చల్ల రాజు, శివ, కిరణ్‌, అరవింద్‌, బాలులను ఎన్నుకున్నారు.

మల్హర్‌(మహాముత్తారం): సీఎం కప్‌లో భాగంగా జిల్లాస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో మండలంలోని దుబ్బలపాడు ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పి.అంజలి 400 మీటర్స్‌, 100 మీటర్ల రన్నింగ్‌ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. బ్యాడ్మెంటన్‌ విభాగంలో అంజలి, రిశ్విక, ఖోఖో విభాగంలో సుమలత, రక్షిత స్టేట్‌ లెవెల్‌కు ఎంపికయినట్లు పీడీ తిరుపతి చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ షరీఫ్‌, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

మల్హర్‌(మహాముత్తారం): మహాముత్తారం మండలంలోని పెగడపల్లి ప్రధాన రహదారి వద్ద మంగళవారం మహాముత్తారం ఎస్సై–2 మహేష్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కనుకునూర్‌, మహాముత్తారం, బోర్లగూడెం వెళ్లే వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన ప్రతాలను పరిశీలించి పత్రాలు సక్రమంగా లేని వారికి జరిమాన విధించారు. అనుమానితులను విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షలు
1
1/3

కేసీఆర్‌కు శుభాకాంక్షలు

కేసీఆర్‌కు శుభాకాంక్షలు
2
2/3

కేసీఆర్‌కు శుభాకాంక్షలు

కేసీఆర్‌కు శుభాకాంక్షలు
3
3/3

కేసీఆర్‌కు శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement