450 మందితో పోలీస్ బందోబస్తు..
భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల భద్రత కోసం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు 8 రూట్లలో పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఇంకు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు పూర్తిగా నిషేధమని స్పష్టంచేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు
జారీచేస్తున్న అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్


