సమ్మెతో కార్మికులకే నష్టం | - | Sakshi
Sakshi News home page

సమ్మెతో కార్మికులకే నష్టం

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

సమ్మెతో కార్మికులకే నష్టం

సమ్మెతో కార్మికులకే నష్టం

భూపాలపల్లి అర్బన్‌: జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం, కోలిండియా పరిధిలో ఉంటాయని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మె కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి నష్టం జరగడం వలన రూ.77 కోట్లు, కార్మికులకు రూ.12కోట్ల నష్టం వాటిల్లితుందన్నారు. నూతన లేబర్‌ కోడ్‌ల వలన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు నష్టం లేదన్నారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. కార్మికులు గ్రహించి సమ్మెకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్యాంసుందర్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement