మందు.. మనీ.. గిఫ్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

మందు.. మనీ.. గిఫ్ట్‌లు

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

మందు.

మందు.. మనీ.. గిఫ్ట్‌లు

మందు.. మనీ.. గిఫ్ట్‌లు

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాటం

భూపాలపల్లి: ఓటర్లను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. పంపిణీకి కాదేది అనర్హం అన్నట్లుగా డబ్బు, మందుతో పాటు వివిధ రకాల నజరానాలు అందజేశారు. చీరలు, టవల్స్‌, క్రికెట్‌ కిట్‌లు, చికెన్‌, కూల్‌డ్రింక్స్‌ కూడా ఓటర్లకు పంచారు.

రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు...

భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ప్రతీ వార్డులో డబ్బు పంపిణీ జరిగింది. ఒక్కో వార్డులో సుమారుగా 1500 నుంచి 2200 ఓట్ల వరకు ఉన్నాయి. అందులో మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, డబుల్‌ ఓట్లు సుమారు రెండు వందల వరకు ఉన్నాయి. మిగిలిన ఓటర్లకు ఒక్కో వార్డులో ఒక్కో విధంగా అభ్యర్థులు డబ్బు పంపిణీ చేశారు. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఇవ్వగా, పలు వార్డుల్లో రూ.1,500 నుంచి రూ. 2వేల వరకు ఇచ్చారు. ఏ వార్డులో కూడా ఓటుకు రూ.1,500లకు తక్కువగా ఇవ్వలేదు. మొత్తంగా ఒక్కో అభ్యర్థి నగదు పంపిణీ విషయంలోనే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

కనిపించని అధికారులు..

ఎన్నికల నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘన జరిగినా, కట్టడి చేయాల్సిన అధికారులు, ప్రత్యేక టీంలు అంతగా కానరాలేదు. అభ్యర్థులు తమ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ డబ్బు, నజరానాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసినా అంతగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నామమాత్రంగా రహదారులపై తనిఖీలు చేపట్టారని, చిన్నచిన్న కేసులు మాత్రం నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో ఖర్చును చూసి సాధారణ ప్రజలు నివ్వెరపోయారు. డబ్బు లేని వారు ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు లేవంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

డబ్బు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోననే భయంతో కొందరు అభ్యర్థులు ప్రత్యేక నజరానాలు ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రతీ ఇంటికి కేజీ చికెన్‌, కూల్‌డ్రింక్స్‌, ఒక క్వార్టర్‌ మద్యం, చీరలు, టవల్స్‌, యువకుల కోసం క్రికెట్‌ కిట్స్‌ అందజేశారు. కొన్ని వార్డుల్లో అయితే వాడకొక మేకను గిఫ్ట్‌గా ఇవ్వడంతో రాత్రంతా దసరాను తలపించింది. మొత్తంగా ప్రత్యర్థుల వైపు ఓటర్లు మళ్లకుండా ఉండేందుకు పలువురు అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. అర్ధరాత్రి వరకు ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారు కోరినవన్నీ అందిస్తూ వచ్చారు.

విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ

చీరలు, టవల్స్‌, క్రికెట్‌ కిట్‌లు, చికెన్‌, కూల్‌డ్రింక్స్‌ కూడా..

అర్ధరాత్రి వరకు

ఓటర్ల ఇళ్ల చుట్టూ అభ్యర్థులు

మందు.. మనీ.. గిఫ్ట్‌లు1
1/1

మందు.. మనీ.. గిఫ్ట్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement