శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

లబ్‌...డబ్‌

న్యూస్‌రీల్‌

– IIలోu

ర్యాలీలకు అనుమతి లేదు :

ఎస్పీ సంకీర్త్‌

అంబేడ్కర్‌ స్టేడియంలోని మినీ ఫంక్షన్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు

భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్‌: మూడు ప్రధాన పార్టీలు, 107 మంది అభ్యర్థులు, 30 వార్డుల్లో పోటీ, వీరిలో ఎవరెవరు గెలుపుతీరాలను చేరుతారనే విషయం మధ్యాహ్నంతో స్పష్టత రానుంది. దాదాపు 15 రోజులుగా నెలకొన్న మున్సిపల్‌ ఎన్నికల హంగామాకు నేడు (శుక్రవారం) జరిగే ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది. ఇందుకు సంబంఽధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలోని మినీ ఫంక్షన్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

మధ్యాహ్నానికే వెలువడనున్న ఫలితాలు

భూపాలపల్లి మున్సిపల్‌ పీఠాన్ని ఎవరు కై వసం చేసుకుంటారనేది మధ్యాహ్నంలోపు స్పష్టత రానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 10 గంటల వరకే ఫలితాల సరళి తెలియనుంది. 30 వార్డుల్లో సగటున 1800 ఓటర్లు ఉంటే వీటిలో సగటున 1100 నుంచి 1300 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్నంలోపే పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అందరిలో ఉత్కంఠ.. క్యాంపులు షురూ..

ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే ఉత్కంఠలో అందరూ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగింది. కొన్ని వార్డుల్లో ఓటరు నాడి కనిపెట్టడం కష్టంగా ఉందని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో విపరీతమైన టెన్షన్‌ నెలకొంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి అభ్యర్థులందరూ ఓట్లు ఎటు పడ్డాయనే విశ్లేషణల్లో ఉన్నారు. కులసంఘాల ఓట్లు, తమ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎటు పడ్డాయనే లెక్కల్లోనే ఇంకా అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే గెలుపొందిన తరువాత పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు అంతగా పోటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. చైర్మన్‌ స్థానాన్ని ఎవరు కై వసం చేసుకున్నా ఒకటి, రెండు సీట్ల ఆధిక్యంతో మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు క్యాంపు రాజకీయాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి సాయంత్రం ఫలితాల వెల్లడి కాగానే ఆయా పార్టీల నేతలు తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించేందుకు సిద్ధం అవుతున్నారు.

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు..

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌ శర్మ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్రీడా ప్రాంగణంలోని మినీ ఫంక్షన్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లకు ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు. లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్‌ వైజ్‌ కౌంటింగ్‌ విధానం, బ్యాలెట్‌ పేపర్లు వేరు చేయుట, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల కోసం

ఏర్పాటు చేసిన కుర్చీలు

‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా..

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ర్యాలీలు, ఊరేగింపులు, బైక్‌ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కాపాడేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/3

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/3

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20263
3/3

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement