అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశి రాత్రిని పురస్కరించుకుని న్యాయవాది చండ్రపాటి చిదంబరనాథ్‌శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు.


