సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ
● ఛైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి
● మూడు జిల్లాల అధికారులతో సమీక్ష
● సింగరేణి ఉద్యోగుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య
హన్మకొండ అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ బృందం శుక్రవారం పర్యటనలో గుర్తించిన అంశాలను ప్రస్తావించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో లోపాలున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ, వరంగల్ డీఈఓలను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, ఇమ్యునైజేషన్ స్థితిగతులపై పూర్తి వివరాలు సమర్పించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్యకు సూచించారు. బాల్యవివాహాల నిర్మూలన, బాల్యవివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ‘స్టూడెంట్ వెల్‌నెస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందనగౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేశ్, ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి, డీఎంహెచ్‌ఓలు అప్పయ్య, సాంబశివరావు, భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేశ్, ఎస్.ప్రవీణ్‌కుమార్, ఉమ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, జి.తిరుపతి, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదంలో సింగరేణి సంస్థ
భూపాలపల్లి అర్బన్: ఉత్తర తెలంగాణకు కొంగుబంగారంగా పేరొందిన సింగరేణి సంస్థ కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరెటి రాజన్న, నాయకులు సమ్ము రాజయ్య, దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్‌రెడ్డి, జైపాల్‌సింగ్, బేగ్, మాదరబోయిన వెంకటేష్, నామల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, బీరన్న పాల్గొన్నారు.
సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ


