హాట్‌టాపిక్‌గా దేవాదుల ప్రాజెక్టు | - | Sakshi
Sakshi News home page

హాట్‌టాపిక్‌గా దేవాదుల ప్రాజెక్టు

Feb 22 2026 7:15 AM | Updated on Feb 22 2026 7:15 AM

హాట్‌టాపిక్‌గా దేవాదుల ప్రాజెక్టు

హాట్‌టాపిక్‌గా దేవాదుల ప్రాజెక్టు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : జేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్‌ ఆయకట్టుకు కీలకమైన ప్రాజెక్టులో దేవాదుల పంపుహౌస్‌ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్‌లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దేవన్నపేట పంపుహౌస్‌ను హుటాహుటిన సందర్శించారు. మోటార్లు రన్‌ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా.. ఆ వెంటనే మోటార్లు ఆన్‌ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటిని ఆన్‌చేయగా యాసంగి సీజన్‌ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్‌లోనూ దేవన్నపేట పంపుహౌస్‌లో మోటార్లు ఆన్‌ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందం... కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, గోదావరిలో సరిపడా నీళ్లున్నా దేవాదుల ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్‌ చేయడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్‌లో నీటిపారుదలశాఖ అధికారులు శనివారం మోటార్‌ను ఆన్‌చేశారు. సాగునీరు అందించేందుకు పంపు ఆన్‌ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ సీఎం రేవంత్‌ టూర్‌ షెడ్యూల్‌...

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయలుదేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు.

ప్రాజెక్టు పంపుహౌస్‌లకు నేతల తాకిడి

నిన్న బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌,

మాజీ ఎమ్మెల్యేల బృందం

నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక..

గంగారం వద్ద పనుల పరిశీలన

అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష

ఎట్టకేలకు ఒక మోటార్‌ను ఆన్‌ చేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement