26న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ హరికృష్ణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బంజారా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి గురుకులాల 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు(ఆదివారం) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలికలు), ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలురు) కాటారం, మోడల్ స్కూల్ గంగారం క్రాస్, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల చిట్యాల, మోడల్ స్కూల్ గణపురం, మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల గాంధీనగర్, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మొగుళ్లపల్లిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,667 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
బైక్‌ను ఢీకొట్టిన
ఇసుక లారీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని నర్సరీ వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను ఇసుక లారీ ఢీకొట్టిన ఘటనలో అన్నదమ్ములు గాయాలపాయ్యారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా చంద్రాపూర్‌కు చెందిన అన్నదమ్ములు ఉజ్వల్, ప్రజ్వల్ ద్విచక్రవాహనంపై శనివారం మేడారం బయలుదేరారు. నర్సరీ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ఉజ్వల్‌కు మొహం, పంటికి, ప్రజ్వల్‌కు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. లారీతో సహా డ్రైవర్ పరారయ్యారు. క్షతగాత్రులను స్థానికులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పోలీసులు ఘటనా స్థఽలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
రామప్పను సందర్శించిన ఆర్టీఐ కమిషనర్
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
26న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు


