ప్రజామద్దతుకు నిదర్శనం
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించిన భూపాలపల్లి పట్టణ ఓటర్లకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఽశుక్రవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చూపిన విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజా మద్దతుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల విజయంలో కీలక భూమిక పోషించిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ప్రజా పాలన, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పట్టణ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఓటు వేశారని హర్షం వ్యక్తం చేశారు.


