ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఇసుక లారీ
ఏటూరునాగారం: ఓ ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మండల పరిధిలోని రొయ్యూర్ సమీపంలో గల 163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలోని నలుగురు, ఇంజిన్‌పై కూర్చున్న ఇద్దరు ఎగిరిపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన కూలీలు ట్రాక్టర్ యజమాని పూజారి బుచ్చయ్యతో కలిసి మిర్చి తోట నుంచి ఏటూరునాగారం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఆరుగురిని 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులు గాయాలతో బయపడినట్లు వైద్యులు తెలిపారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టి వెళ్లిన లారీ కోసం స్థానికులు ఆరా తీస్తున్నారు.
నేషనల్ ఇంటిగ్రేషన్
క్యాంపునకు కార్తికేయ
కేయూ క్యాంపస్: కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 17 నుంచి 23వ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరం (నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు)లో కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ బాలంకి కార్తికేయ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ శనివారం తెలిపారు. ఈ మేరకు కార్తికేయను కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.శైలజ, ఎం.సౌజన్య తదితరులు అభినందించారు.


