భూపాలపల్లి అర్బన్: కరుణ, దయ, ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని సీఎస్‌ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎస్ జోసఫ్‌కిషోర్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక సీఎస్‌ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చర్చిల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ కిషోర్ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాలి కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నతమైన వ్యక్తి ఏసు ప్రభువు అని కొనియాడారు. సమాజంలో శాంతి, కరుణ ప్రేమ ఈ మానవాళికి పంచిన ప్రేమ మూర్తి అని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకమని అన్నారు.


