ఘనంగా ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు
రేగొండ: మండలంలోని కొడవటంచ ఆలయంలో స్వామి వారికి ధాన్యాధివాసం ఫల, పుష్పశయ్యాధివాసములు, న్యాసవిధి కార్యక్రమాలను శుక్రవారం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ధ్వజస్తంభం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునఃప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యేలు విజయరమణారావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్మాణాలను పరిశీలించారు.
నేడు స్పీకర్ రాక..
కొడవటంచ ఆలయంలో నేడు (శనివారం) శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ ఆండాల్ ఆళ్వార్ల ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రానున్నట్లు ఆలయ చైర్మన్ నాయినేని సంపత్‌రావు తెలిపారు.
ఘనంగా ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు


