డేంజర్ జోన్ నిర్వాసితులతో సమావేశం
మల్హర్: మండలంలోని పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులతో బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి శ్రీధర్‌బాబు తన కార్యాలయంలో జెన్‌కో సీఎండీ హరీష్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌లతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఇళ్లను సేకరించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్వాసితులు మంత్రి, సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. శాసీ్త్రయ పద్ధతిలో సర్వే నిర్వహించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్ అజయ్, తాడిచర్ల సర్పంచ్ స్వామి, నిర్వాసితులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: హకీంపేట్ తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కోసం మండల, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10 బాలికలు, బాలుర చొప్పున మొత్తం 20 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేటి (గురువారం) నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. మండల స్థాయి పోటీలు మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలు భూపాలపల్లిలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఎంపికలో శారీరక ప్రమాణాలు, క్రీడా పరీక్షలు, మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాల ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు మండల విద్యాఅధికారిని సంప్రదించాలన్నారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్‌పీ తిప్పనబోయిన రామకృష్ణ ప్రకృతిని గౌరవిస్తూ వృక్షపూజ నిర్వహించారు. బుధవారం పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠ్యబోధనలో భాగంగా విద్యార్థులకు ప్రకృతిలో చెట్ల గొప్పతనాన్ని వివరించారు. పర్యావరణానికి హాని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మానవాళికి, పక్షులకు, జంతువులకు, జీవరాసులకు కేంద్రమైన చెట్లు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం అధ్యక్షుడు కమలాకర్, ఆర్‌పీలు ఏడుకొండలు, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్‌స్ప్రీ–26 బ్యానర్‌ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్‌సాయంతో ఆకాశంలో బ్యానర్‌ను ఆవిష్కరించారు.ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్‌స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు.
డేంజర్ జోన్ నిర్వాసితులతో సమావేశం
డేంజర్ జోన్ నిర్వాసితులతో సమావేశం


