‘మేడారం’ ఆదాయం | - | Sakshi
Sakshi News home page

‘మేడారం’ ఆదాయం

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

‘మేడారం’ ఆదాయం

‘మేడారం’ ఆదాయం

గత(2024) జాతర ఆదాయం రూ,12,71,79,280

రూ.13,51,76,275

హన్మకొండ కల్చరల్‌: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది.

చివరిరోజు లభించిన ఆదాయం..

ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్‌ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది.

జాతర ఆదాయం రూ.13,51,76,275

మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు.

ఏటా పెరుగుతున్న ఆదాయం

1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్‌ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది.

పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు

చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399

ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్‌ల ద్వారా) రూ. 21,36,607

గత జాతరకంటే అదనంగా

288 హుండీల ఏర్పాటు

అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు

2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement