రామప్పను సందర్శించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

రామప్పను సందర్శించిన అధికారులు

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

రామప్పను సందర్శించిన అధికారులు

రామప్పను సందర్శించిన అధికారులు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న 41 మంది అటవీశాఖ అధికారులు డీసీఎఫ్‌ఓ గంగారెడ్డి ఆధ్వర్యంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువుతో పాటు పాలంపేట గ్రామ శివారులోని కేన్‌ మొక్కలను సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement