కోటగుళ్ల సందర్శన
గణపురం: కాకతీయుల కళా క్షేత్రం గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను శుక్రవారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు బుర్ర నవీన్‌కుమార్ సందర్శించారు. ఆయనకు అర్చకుడు నాగరాజు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా సంక్షేమాధికారి జి.మల్లిశ్వరి, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ అనిల్‌చందర్ రావు, డీవీఏహెచ్‌ఓ ఎ.కుమారస్వామి, గణపురం–2 ఎస్‌ఐ అమూల్య ఉన్నారు.
కమిషన్ మెంబర్ పర్యటన
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ బొర్ర నవీన్ కుమార్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. భూపాలపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్, మైనార్టీ బాలుర పాఠశాల, ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, చైల్డ్ కేర్ ఇన్స్‌ట్యూషన్స్ కాటారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాలల భవిష్యత్, హక్కుల కోసం ప్రతీ ఒక్క డిపార్ట్‌మెంట్ బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ అనిల్ చందర్రావు, డీఎంహెచ్‌ఓ మధుసూదన్, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటరత్నం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా, వెటర్నరీ డాక్టర్ కుమారస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి పాల్గొన్నారు.
మార్చి 5న జాబ్‌మేళా
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో మార్చి 5న హనుమకొండలోని గిరిజన భవన్‌లో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివిన నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు. గిరిజన నిరుద్యోగులు మార్చి 5న ఉదయం 10 గంటలకు హనుమకొండ గిరిజన భవన్‌కు బయోడెటా, సర్టిఫికెట్స్‌ను నేరుగా తీసుకొని హాజరు కావాలని కోరారు.
మేడారం జాతరపై పుస్తకం ఆవిష్కరణ
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రచురించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో అరుదైన చాయాచిత్రాలను సంకలం చేసి పుస్తకంగా రూపొందించిన ప్రముఖ చిత్ర నిర్మాత నర్సింగరావు, ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీపీ పాపారావు, రిటైర్డ్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ రతన్ జె పూలెలను మంత్రి ప్రశంసించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
కోటగుళ్ల సందర్శన
కోటగుళ్ల సందర్శన


