అందలం | - | Sakshi
Sakshi News home page

అందలం

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

అందలం

అందలం

అవినీతి అధికారికి అందలం హనుమకొండ జిల్లాలో ప్రభుత్వానికి సరెండర్‌

అవినీతి అధికారికి
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వానికి సరెండర్‌

ఇన్‌చార్జ్‌గా పనిచేసిన భూపాలపల్లి జిల్లాలో సైతం అనేక ఫిర్యాదులు

పైరవీతో పది రోజుల్లోనే భూపాలపల్లికి రీపోస్టింగ్‌

కలెక్టర్‌ దృష్టి సారించాలని కోరుతున్న ఉద్యోగులు

భూపాలపల్లి అర్బన్‌: హనుమకొండ డీఈఓ కార్యాలయం సమగ్ర శిక్షలో ఫైనాన్స్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌గా (ఎఫ్‌ఏఓ), భూపాలపల్లి డీఈఓ కార్యాలయ ఇన్‌చార్జ్‌ ఎఫ్‌ఏఓగా డిప్యుటేషన్‌పై(ఫారిన్‌ సర్వీస్‌) పనిచేస్తున్న అధికారి(జేఏఓ)ని పలు అవినీతి ఆరోపణలతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ /సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు సరెండర్‌ చేస్తూ హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకుండా తిరిగి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ట్రెజరీశాఖకు జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి (జేఏఓ) డిప్యుటేషన్‌పై విద్యాశాఖలో అడుగుపెట్టి కిందిస్థాయి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అందలం1
1/1

అందలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement