ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి
ములుగు రూరల్: మండల పరిధిలోని రాయినిగూడెంలో గుట్టమీది ముసలయ్య జాతరకు పూజారులు తేదీలను ఖరారు చేయడంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తవిటి నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం గుడిశుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు గుట్టమీది ముసలయ్య జాతర నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొ క్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తవిటి పుష్పక్క, రాములు, సమ్మయ్య, రామస్వామి, విజయ, సర్పంచ్ ఈసం సునీత, ఉప సర్పంచ్ దేవేందర్‌రావు, ఆలయ ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


