కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చి దగా చేశారు..
బీఆర్‌ఎస్ హయాంలోనే
తొర్రూరు అభివృద్ధి..
నర్సంపేటలో రౌడీల్లా
మాట్లాడుతున్నారు..
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.
ఆదివారం నాలుగోరోజు 200 మేడారం హుండీలు లెక్కించగా రూ.2,64,75,757 ఆదాయం వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు.
రోడ్‌షోకు హాజరైన పార్టీ శ్రేణులు
నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పైసా పని చేయలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయక మో సం చేశారని.. ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆది వారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రోడ్ షోలు నిర్వహించారు. ఆయా చోట్ల కేటీఆర్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నారని, హామీల పేరుతో మోసం చేసిన రేవంత్‌రెడ్డి సర్కారుకు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. రూ.4వేల పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదని, బతుకమ్మ చీర ఏమైందని, రంజాన్‌తోఫా రాలేదని, దీంతో పాటు పలు రకాల వాగ్దానాలు విస్మరించిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి గుణపాఠం చెప్పాలన్నారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందన్నారు.
వర్ధన్నపేటలో దొంగ, పోలీస్ కలిసి మోసం..
దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును విమర్శించారు. రైతులకు, ప్రజలకు వెనకటి రోజులు తెప్పిస్తానని సీఎం అన్నారని వ్యంగ్యంగా అన్నారు. ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి రైతులు క్యూలైన్‌లో చెప్పులు పెట్టుకునేలా చేసి వారి అరిగోస పుచ్చుకున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే వర్ధన్నపేటలో జంక్షన్లు, రోడ్డు వెడల్పు, వీధి లైట్లు, డ్రైయినేజీలు అభివృద్ధి చేశా మన్నారు. రెండేళ్లలో చేయలేని వాడు వచ్చే మూడేళ్లలో ఏం పనులు చేస్తారని ప్రశ్నించారు. వంద పడకల ఆస్పత్రి పట్టణం నుంచి ఎందుకు మారుస్తున్నారని, తిరిగి ఇక్కడే అంటూ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తండాలను వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు గిరిజనులకు ఇష్టం లేకుంటే తమ ప్రభుత్వం రాగానే, పాత పంచాయతీ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు.
చేయిచ్చిన పార్టీని నమ్మకండి..
హామీల అమలులో ప్రజలకు చేయిచ్చిన, చెవిలో పూలు పెట్టే కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. మార్పు కోసం కాంగ్రెస్‌కు ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, 420 హామీలిచ్చి అమలు చేయకుండా మోసగించారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క తప్పు ఓటు వేస్తే ఐదేళ్లు బాధ పడతారని, ఒక్కసారి వేసే మోసపోయారని మళ్లీ పునరావృతం కావద్దన్నారు. మున్సిపాలిటీల్లో ఓటు అడిగే అర్హత బీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్లేనన్నారు.11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భస్మాసుర హస్తానికి ఎగనామం పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి ఆదరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, నాగుర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తొర్రూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. తొర్రూరులో రూ.వందల కోట్ల అభివృద్ధి నా హయాంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ పని చేసిందో చెప్పాలి. వంద పడకల ఆస్పత్రి, మినీ ట్యాంకుబండ్, ఇతర పనులు మంజూరు చేయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాకు పేరు వస్తుందనే భయంతో పనులు చేయడం లేదు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి
నేను నర్సంపేట పట్టణ అభివృద్ధికి తెచ్చిన నిధులను వాడుతున్నారే తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రౌడీయిజం చెలాయించే విధంగా మాట్లాడుతున్నారే తప్ప అభివృద్ధి పట్ల అంకిత భావం లేదు. నన్ను బెదిరించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు.. వారి వల్ల ఏమీ కాదు.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే


