మే తొలి వారంలోపు పూర్తి
కాళేశ్వరం: సరస్వతినది అంత్యపుష్కరాలకు సంబంధించి చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు మే తొలి వారంలోపు పూర్తిచేయాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. మే 21నుంచి జూన్ 1వరకు కాళేశ్వరంలో జరుగు పుష్కరాల ప్రతిపాదిత పనులను శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ కార్యాలయంలో ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంక్తీర్త్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.30.61 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మూడు నెలల సమయం ఉన్నందున పనులకు ప్రాధాన్యత నిర్ణయించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిపై ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపడుతానన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అటవీమార్గంలోని కుదురుపల్లి–బీరసాగర్ రహదారి నిర్మాణానికి అంచనాలు సమర్పించాలన్నారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి, 30–40 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరస్వతీఘాట్ వద్ద పక్షితీర్ధంను అభివృద్ధి చేయాలని అర్కిటెక్చర్ మ్యాప్ ద్వారా వివరించారు. టెంట్‌సిటీ, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్‌ల వద్ద జనరేటర్ల ఏర్పాటు చేయాలని, చరిత్ర ఆనవాళ్లు పదిలంగా ఉండేవిధంగా 86 గదుల భవనం సమీపంలో మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.
ప్రతిపాదనల మార్పుల కోసం..
అంచనా ప్రతిపాదనల్లో మార్పులు అవసరమైతే రెండు రోజుల్లో సవరించిన ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
రేగొండ: కోటంచలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ అన్నారు. ఆలయంలో పనులతో పాటు, ఆలయ మాడ వీధులు, షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహ పనులను ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ నెల 8న సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆలయ ఈఓ మహేష్ పాల్గొన్నారు.
సరస్వతినది అంత్యపుష్కరాల
పనులకు డెడ్‌లైన్
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్


