కాళేశ్వరంలో పారిశుద్ధ్య సేవలు | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో పారిశుద్ధ్య సేవలు

Feb 17 2026 8:15 AM | Updated on Feb 17 2026 8:15 AM

కాళేశ

కాళేశ్వరంలో పారిశుద్ధ్య సేవలు

కాళేశ్వరం: కాళేశ్వరంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో పలువీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. పలుచోట్ల బ్లీచింగ్‌ చల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, ఎంపీఓలు భవాని, ప్రకాశ్‌రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

కౌన్సిలర్లకు సన్మానం

భూపాలపల్లి రూరల్‌: బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సన్మానించారు. నిబద్ధతతో ప్రజాసేవ చేసి పార్టీ గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. మున్సిపల్‌ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అర్బన్‌ అధ్యక్షుడు కటకం జనార్దన్‌, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సేవాలాల్‌ సేవలు

మరువలేనివి

ఏటూరునాగారం: సేవాలాల్‌ సేవలు మరవలేనివని మహబూబాబాద్‌, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ హరిసింగ్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలలో సేవాలాల్‌ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి హరి సింగ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం వారం రోజులపాటు సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సి పాల్‌ శ్రీరాములు, అధ్యాపకులు వీరన్న, జైపా ల్‌, కుమారస్వామి, పృథ్వీరాజ్‌, గోపాల్‌రావు, నర్సయ్య, కృష్ణయ్య, శంకర్‌ పాల్గొన్నారు.

మంత్రి సీతక్కను

సత్కరించిన నాయకులు

గోవిందరావుపేట: ములుగు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మ న్‌ ఎన్నిక అనంతరం చల్వాయి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.

కాళేశ్వరంలో  పారిశుద్ధ్య సేవలు
1
1/2

కాళేశ్వరంలో పారిశుద్ధ్య సేవలు

కాళేశ్వరంలో  పారిశుద్ధ్య సేవలు
2
2/2

కాళేశ్వరంలో పారిశుద్ధ్య సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement