ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడలు

Feb 17 2026 8:15 AM | Updated on Feb 17 2026 8:15 AM

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడలు

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడలు

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడలు

భూపాలపల్లి: పాఠశాల విద్యాశాఖ (సమగ్ర శిక్ష) ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రాష్ట్రస్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాలొనేందుకు జిల్లా విద్యాశాఖ తరఫున బయలుదేరిన విద్యార్థుల బస్సును సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్‌, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement