మంచి మార్కుల సాధనకు కృషి
ప్రతీ విద్యార్థిపైన ప్రత్యేకంగా శ్రద్ధపెడుతున్నాం. మంచి మార్కుల సాధనకు ఉపాధ్యాయులం కృషి చేస్తున్నాం. వెనుబడిన విద్యార్థులపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో గమనించి ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహిస్తున్నాం.
– దొనికల రాజేందర్, స్కూల్ అసిస్టెంట్
ఫిజికల్‌సైన్స్, కాళేశ్వరం జెడ్పీహెచ్‌ఎస్
సబ్జెక్టుల వారీగా ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ చూపుతున్నాం. మంచి మార్కులే లక్ష్యంగా సెలబస్ పూర్తి చేసి రివిజన్ కంప్లీట్ చేశాం. ఇంగ్లిష్ సబ్జెక్టులో మంచి స్కోరింగ్ చేయడానికి విద్యార్థులకు తగు సూచనలు ఇస్తున్నాం.
– మియాపురం జగన్నాఽథం, స్కూల్
అసిస్టెంట్ ఇంగ్లిష్, జెడ్పీహెచ్‌ఎస్ వెలిశాల
నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సిలబస్ పూర్తిచేసి ఉపాధ్యాయులు రివిజన్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేశారు. ప్రతీ సబ్జెక్టు వారీగా ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి మంచి మార్కులు సాధిస్తారు.
– రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి
మంచి మార్కుల సాధనకు కృషి
మంచి మార్కుల సాధనకు కృషి


