సమస్యల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

సమస్యల స్వాగతం

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

సమస్య

సమస్యల స్వాగతం

సమస్యల స్వాగతం కోతులు, కుక్కలతో తీవ్ర ఇబ్బందులు ఒంటికి, రెంటికి తీవ్ర ఇబ్బందులు..

మరికొన్ని సమస్యలు ఇలా..

కొత్త పాలకవర్గానికి అనేక సవాళ్లు

కోతులు, కుక్కలు, పందుల బెడద నివారించాలి

శ్మశానవాటికలో

కనీస సౌకర్యాలు కరువు

మూడు కూడళ్ల విస్తరణపై

దృష్టి సారించాలి

చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా కేంద్రంలో రాత్రి పగలు తేడా లేకుండా కోతులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. రోజుకు పదికి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. గత పాలకులు కోతుల నివారణకు పట్టణ సరిహద్దుల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు అమలు కాలేదు. అంతేకాక కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రధాన రహదారులు, అంబేడ్కర్‌ చౌరస్తా మినహా, కూడళ్ల వద్ద సులభ్‌ కాంపెక్ల్‌లు లేక ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం పలు సెంటర్లలో 8 సులభ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించారు. అయితే నీటి సరఫరా లేకపోవడంతో అవి వృథాగా ఉన్నాయి. మరమ్మతు చేపట్టి, నీటి సరఫరా చేసి వినియోగంలోకి తీసుకోవరావాలని పలువురు కోరుతున్నారు.

భూపాలపల్లి పట్టణంలో ప్రతీ గురువారం జరిగే వారసంతలో కనీస సౌకర్యాలు లేవు. వారసంత శాశ్వత స్థలం కేటాయించలేదు. సంతలో వ్యాపారుల సౌకర్యార్థం ప్లాట్‌ఫాంలు, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

సుమారు ఐదేళ్ల క్రితం కూరగాయల మార్కెట్‌ సమీపంలో సమీకృత నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవనాన్ని నిర్మించి ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దీంతో చికెన్‌, మటన్‌ వ్యాపారులు ప్రధాన రహదారులపైనే తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో దుర్గందం వెదజల్లుతుంది.

అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి కృష్ణకాలనీకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుంది. రహదారి విస్తరణకు ప్రణాళికలు రూపొందించినా..ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

అంబేడ్కర్‌ సెంటర్‌, గణేష్‌ చౌక్‌లో బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

పట్టణం పొడవున జాతీయ రహదారిపై ఉన్న షాపుల ఎదుట ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయి. దుఖాణదారులు తమ బోర్డులు, వస్తువులను ఫుట్‌పాత్‌లపైనే ప్రదర్శిస్తుండటంతో పాదాచారులు, మహిళలు చేసేది లేక రహదారిపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

బాంబులగడ్డ వద్ద గల శ్మశానవాటికలో ఒకటే బోరు ఉంది. అ ది మరమ్మతుకు నోచుకున్న సమయంలో దహన సంస్కారాల నిమిత్తం వచ్చిన వారు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అలాకే ఒ కే శ్మశానవాటిక సరిపోవడం లేదు. పట్టణంలో మిగిలిన మూడు వైపులా శ్మశానవాటిక ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుంది.

చిరు వ్యాపారులు రహదారులపైనే తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వారి సౌకర్యార్థం బస్టాండ్‌ సమీపంలో నిర్మించి, ప్రస్తుతం వృథాగా ఉన్న స్ట్రీట్‌ వెండర్స్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తీసుకురావాలి.

సమస్యల స్వాగతం1
1/2

సమస్యల స్వాగతం

సమస్యల స్వాగతం2
2/2

సమస్యల స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement