ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

Feb 14 2026 8:03 AM | Updated on Feb 14 2026 8:03 AM

ప్రత్

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

రాజగోపురానికి అడ్డంగా బారికేడ్లు!

గణపురం: కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

తొడుగు బహూకరణ

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి స్వర్ణలత–భాస్కర్‌ రెడ్డి దంపతులు గణపేశ్వరుడికి రూ.80వేల విలువగల నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును బహూకరించారు. వారికి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నగరంపల్లి మాజీ సర్పంచ్‌ మాదాటి సత్యలక్ష్మీనారాయణ రెడ్డి, బైరెడ్డి మహేందర్‌ రెడ్డి, కొమ్మెర శైలజ శ్రీనివాస్‌ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

నాగదేవత పడిగె లభ్యం

మల్హర్‌: మండలంలోని దబ్బపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతీర్థం (సమ్మక్క–సారలమ్మ) జాతర నిర్వహించే ప్రదేశంలో నాగదేవత పడిగె లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతూండ్ల గ్రామానికి చెందిన మహిళకు దేవుడి వచ్చి దుబ్బతీర్థం జాతర ఆవరణలో నాగులమ్మ దేవత పడిగె ఉంది బయటకు తీసి పూజలు చేయాలని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈమేరకు జాతర ఆవరణలో తవ్వి చూడక నాగపడిగె దొరికినట్లు చెప్పారు. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని నాగుదేవత పడిగెకు పూజలు చేశారు. కొయ్యూరు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.

కాళేశ్వరం: కాళేశ్వరం రాజగోపురం వద్ద బారీకేడ్లు ఇనుప పెన్సింగ్‌తో అడ్డంగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో రాజగోపురం ఎదుట క్యూలైన్‌లకు మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు నేరుగా ఆలయంలోకి వెళ్లేవారు. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా రాజగోపురం ఎదుట 100 మీటర్ల పొడవుతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో గోదావరివైపు నుంచి వచ్చే భక్తులు, బస్టాండ్‌ వైపు నుంచి వచ్చే వారంతా క్యూలైన్‌లో వెళ్లేందుకు క్యూ కాంప్లెక్సు వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఎదుట మార్గం లేకపోవడంపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

ప్రత్యేక అలంకరణలో  గణపేశ్వరుడు
1
1/3

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

ప్రత్యేక అలంకరణలో  గణపేశ్వరుడు
2
2/3

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

ప్రత్యేక అలంకరణలో  గణపేశ్వరుడు
3
3/3

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement