అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మల్హర్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని తాడిచర్ల రైతు వేదికలో 99 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బండి స్వామి, గడ్డం క్రాంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ఉప సర్పంచ్ బబ్బలి రాజు, మాజీ ఎంపీపీ మల్హల్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్‌రెడ్డి


