మేడారంలో భక్తుల రద్దీ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్ పోలీస్‌స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదాయంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు.
జంపన్నవాగులో పుణ్యస్నానాలు
వనదేవతలకు మొక్కులు
మేడారంలో భక్తుల రద్దీ


