బెల్టుషాపులకే విక్రయాలు
● సిండికేటుగా ఏర్పడిన
మద్యం వ్యాపారులు
● ‘బెల్టు’ల కోసం మండలానికి
ఒక ప్రత్యేక షాపు
● ఆ షాపుల్లో రిటైల్ విక్రయాలు బంద్
● పట్టించుకోని ఎకై ్సజ్‌శాఖ అధికారులు
భూపాలపల్లి: మద్యం విక్రయాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. తమకేమీ తెలియదన్నట్లుగా ఎకై ్సజ్‌శాఖ కళ్లు మూసుకుంటుండగా, మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిండికేటుగా ఏర్పడి మండలంలోని ఒక షాపులో రిటైల్ విక్రయాలు జరుపకుండా బెల్టుషాపులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 12 మండలాలు ఉండగా రెండు ఎకై ్సజ్ సర్కిల్‌లు ఉన్నాయి. కాటారం సర్కిల్ పరిధిలో 11, భూపాలపల్లి సర్కిల్‌లో 19 మద్యంషాపులు ఉన్నాయి. ఈ రెండు సర్కిల్‌ల పరిధిలోని మ ద్యం వ్యాపారులు తమ దందాను ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. మండలం యూనిట్‌గా సిండికేటుగా ఏర్పడిన వ్యాపారులు ఒక షాపును పూర్తి గా బెల్టుషాపులకే కేటాయించారు. రేగొండ, చి ట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్.. ఇలా ప్రతీ మండలంలో ఒక షాపులో బెల్టుషాపులకు మాత్రమే మద్యం విక్రయిస్తారు. ఆయా షాపుల్లో రిటైల్ విక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారు.
బెల్టుషాపుల కోసం కేటాయించిన షాపు నుంచి ప్రతీరోజు ప్రత్యేక వాహనాల్లో(ట్రాలీలు) గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం రవాణా చేస్తున్నారు. ఒక్కో షాపు నుంచి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మద్యం సరఫరా చేస్తున్నారు. అంతేకాక బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. ఒక్కో క్వార్టర్, బీరుపై రూ.20 అదనంగా తీసుకొని డెలివరీ చేస్తున్నారు. బెల్టుషాపుల యజమానులు మరో రూ. 20 పెంచి విక్రయిస్తుండటంతో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
సిండికేటుగా ఏర్పడిన వ్యాపారులు ప్రత్యేక తనిఖీ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో టీంలో పదిమంది యువకులు ఉంటారు. వీరంతా వారి పరిధిలోని మండలంలోని బెల్టుషాపుల్లో ప్రతీరోజు తనిఖీలు చేపడుతారు. సిండికేటుగా ఏర్పడిన షాపు నుంచి మద్యం కొనుగోలు చేస్తే చూసి వదిలేస్తారు. లేక ఏదైనా మద్యంషాపు నుంచి ఎమ్మార్పీ ధరకు కొనుగోలు చేసినట్లుగా కనిపిస్తే ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఎకై ్సజ్‌శాఖ అధికారులకు అప్పగిస్తారు. వ్యాపారుల సూచనల మేరకు అధికారులు కేసులు నమోదు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి, బెల్టుషాపులకు మాత్రమే మద్యం విక్రయిస్తున్న షాపుల వద్ద నిబంధనలు కానరావడం లేదు. షాపు ముందు గెజిట్ నంబర్, 18 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మబడదు, ధరల పట్టిక లాంటివి, పర్మిట్ రూంకు సంబంధించిన వివరాలు ఏమీ కనబడవు. ఆయా షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయకుండా చేశారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూతవేటు దూరంలో ఉన్న పోలీసులు, నిత్యం పర్యవేక్షించే ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటం మూలంగానే ‘బెల్టు’ దందాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి.


