విధేయులకే పట్టం
మున్సిపల్ చైర్మన్‌గా కొమురయ్య, వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్
బాధ్యతాయుతంగా
పని చేయాలి..
మున్సిపాలిటీ చైర్మన్ ప్రొఫైల్..
భూపాలపల్లి: స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విధేయులకే మున్సిపల్ పీఠాలు దక్కాయి. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఆయన అనుచరులే ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో సోమవారం నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది.
చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నిక..
మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ఎంపికై న కౌన్సిలర్లు అందరు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు, సీపీఐ ఒకరు, ఒక స్వతంత్ర కౌన్సిలర్.. మొత్తం 18 మంది క్యాంపు నుంచి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయానికి ఒక ప్రత్యేక బస్సులో వచ్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు వేర్వేరుగా వచ్చారు. తొలుత ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్ స్థానానికి బుర్ర కొమురయ్యను కౌన్సిలర్ అప్పం కిషన్ ప్రతిపాదించగా, మరో కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ బలపరిచారు. చైర్మన్ స్థానానికి ఒకరే బరిలో ఉంటంతో బుర్ర కొమురయ్య చైర్మన్‌గా ఎన్నికై నట్లు ఆర్డీఓ హరిక్రిష్ణ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ స్థానానికి అంబాల శ్రీనివాస్‌ను కౌన్సిలర్ బొడ్డు అశోక్ ప్రతిపాదించగా, మరో కౌన్సిలర్ ఇస్లావత్ రాజునాయక్ బలపరిచారు. ఈ స్థానానికి సైతం పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆర్డీఓ వెల్లడించి ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఎన్నిక జరుగుతున్న సమయంలోనే బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఎలాంటి అల్లర్లు లేకుండా..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం ఎలాంటి అల్లర్లు, సంఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సరిపడా మెజార్టీ ఉండటం, ఎమ్మెల్యే సత్యనారాయణరావు సూచనల మేరకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల ఎంపికకు మిగిలిన కౌన్సిలర్లు మద్ధతు పలకడంతో ఘర్షణలు, అలకలు, బుజ్జగింపు పర్వాలు చోటు చేసుకోలేదు.
తడబాటుతో ప్రమాణ స్వీకారం..
ప్రమాణ స్వీకారం సమయంలో పలువురు కౌన్సిలర్లు తడబడ్డారు. దీంతో భూపాలపల్లి ఆర్డీఓ హరిక్రిష్ణ ప్రమాణ స్వీకార పత్రాన్ని చదువుతూ వారితో చెప్పించారు.
20 ఏళ్ల నుంచి వెంట ఉన్న వారికే..
గడిచిన 20 ఏళ్లుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెంట ఉన్న వారికే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కాయనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు కై వసం చేసుకోవడంతో నలు గురు కౌన్సిలర్లు చైర్మన్ పీఠాన్ని, ఐదారుగురు వైస్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. ఈ మేరకు క్యాంపులో సైతం తమవంతు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు. ఎమ్మెల్యే సత్తన్న ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, అతని వెన్నంటి ఉన్న బుర్ర కొమురయ్యకు చైర్మన్, అంబాల శ్రీనివాస్‌కు వైస్ చైర్మన్ పదవులు వరించాయి.
పేరు బుర్ర కొమురయ్య
తండ్రి పేరు రాజీరు
పుట్టిన తేదీ 01–05–1974
చదువు పదవ తరగతి పాస్
వృత్తి సివిల్ కాంట్రాక్టర్
పదవులు మాజీ సర్పంచ్ (జంగేడు)
‘సత్తన్న’ వెంట నడిచిన వారికి దక్కిన అవకాశం
పాలకవర్గం ప్రమాణ స్వీకారం పూర్తి
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికై న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావు ఇవ్వొద్దని, ప్రజల గౌరవాన్ని కాపాడాలని, వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు.
విధేయులకే పట్టం
విధేయులకే పట్టం
విధేయులకే పట్టం


