రైతులను కాపాడుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు
చిట్యాల : దేశానికి అన్నంపెట్టే రైతులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాస్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతు సంక్షేమంపై వివిధ గ్రామాలకు చెందిన అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మాట్లాడారు. రైతులకు చట్టపరమైన ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని పేర్కొన్నారు. ఎరువుల షాపులు, నకిలీ పెస్టిసైడ్స్, నాసిరకం విత్తనాల పర్యవేక్షణకు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి నిత్యం తనిఖీలు చేయాలని కోరుతూ పలు సూచనలు చేశారు. ఈ సదస్సులో పీపీ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్‌రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.శ్రీనివాస్, స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్, సర్పంచ్ తౌటం లక్ష్మి, న్యాయవాదులు రాజ్‌కుమార్, మహేందర్ రెడ్డి, పారా లీగల్ వలంటీర్ ఆరెపల్లి తిరుపతి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాపాక ఆలయం సందర్శన..
మండలంలోని నైన్‌పాకలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి సర్వతోభద్ర ఆలయాన్ని సీనియర్ జడ్జి నాగరాజు సందర్శించి ప్రత్యేక పూజాలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకుడు పెండ్యాల ప్రభాకారచార్యులు దేవాలయ విశిష్టతను వివరించారు. కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్ తదితరులు ఉన్నారు.


