108 ఉద్యోగులకు స్టార్‌ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

108 ఉద్యోగులకు స్టార్‌ అవార్డులు

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

108 ఉద్యోగులకు స్టార్‌ అవార్డులు

108 ఉద్యోగులకు స్టార్‌ అవార్డులు

హన్మకొండ అర్బన్‌/ఎంజీఎం: ఆపద సమయంలో 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మెరుగైన వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడిన హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు 108 సిబ్బందికి 108 సర్వీస్‌ వరంగల్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ పాటి శివకుమార్‌, జిల్లా మేనేజర్‌ మండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్టార్‌ అవార్డులు అందించారు. ఐనవోలుకు చెందిన ఈఎంటీ ఏనుగుల రాజు, పరకాల టీం సభ్యులు పాముల రాజు, పుట్ట విజయభాస్కర్‌, ధర్మసాగర్‌ మండలానికి చెందిన మాచర్ల వెంకటేశ్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన ఈఎంటీలు కె.నాగరాజు, శ్యాంసుందర్‌, పైలట్‌ వై.రాజన్న, కుమారస్వామి అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా మేనేజర్‌ గుర్రపు భరత్‌ కుమార్‌, భూపాలపల్లి మేనేజర్‌ రాజు నాయక్‌, హనుమకొండ మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement