ఆలయ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: కొడవటంచ ఆలయ అభివృద్ధి కోసం నూతనంగా ఏర్పాటైన ఉత్సవ కమిటీ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని కొడవటంచ ఆలయ ప్రాంగణంలో 14 మంది ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ చైర్మన్‌గా నాయినేని సంపత్‌రావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రముఖుల హాజరు..
కొడవటంచ ఆలయంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వేద పండితులు ప్రతిష్టాయాగారంభం, జలధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఉమ్మడి వరంగల్ మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ఆలయ ఈఓ మహేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి


