రాష్ట్రస్థాయికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయికి ఎంపిక

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

రాష్ట

రాష్ట్రస్థాయికి ఎంపిక

కాళేశ్వరం: ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయం’ రేటింగ్‌లో భాగంగా మహదేవపూర్‌ మండలం సూరారం ఎంపీపీఎస్‌ ఎస్సీ కాలనీ పాఠశాల 86.67శాతం ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కె.పద్మ పేర్కొన్నారు. డీఈఓ రాజేందర్‌ చేతుల మీదుగా సోమవారం భూపాలపల్లిలో శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రం, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి పురుషోత్తంరెడ్డి ప్రాథమిక పాఠశాల సూరారం హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ప్రసన్న, శ్రావణ్‌, లక్ష్మణ్‌, స్కావెంజర్‌ స్వప్నను అభినందించారు.

హేమాచలక్షేత్రం

అభివృద్ధిపై నివేదిక

మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై పంచాయతీరాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు సోమవారం నివేదికను అందజేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రెవెల్లి మహేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో సీతక్కను కలిసి ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు. మకర సంక్రాంతి రోజున స్వామివారి వరపూజ మహోత్సవానికి ఆలయానికి వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ఏప్రిల్‌లో జరగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముందుగా ఆలయంలో భక్తుల సౌకర్యానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రికి వివరించి నివేదికను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా 2027 జూన్‌లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మల్లూరులో పుష్కరఘాట్‌ నిర్మాణం చేపడితే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే హేమాచలక్షేత్రంలో చేపట్టాల్సిన పనులతో పాటు మల్లూరులో పుష్కరఘాట్‌ నిర్మాణ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని పూజారులు వివరించారు. మంత్రికి నివేదిక అందజేసిన వారిలో ఆలయ అర్చకులు ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌ రామానుజం దాస్‌, అనిపెద్ది నాగరాజీవ్‌ శర్మ, రికార్డు అసిస్టెంట్‌ లక్ష్మినారాయణ ఉన్నారు.

బస్టాండ్‌ పనులు

నాణ్యతతో చేపట్టాలి

ములుగు: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్‌ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. బస్టాండ్‌ నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో వారు మాట్లాడారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఉండేలా బస్టాండ్‌ నిర్మాణాన్ని చేపడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆసియా షాహిన్‌ రియాజ్‌ మీర్జా పాల్గొన్నారు.

కలెక్టర్‌, ఎస్పీలను కలిసిన కౌన్సిలర్లు

మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చంద్రకళ ఆధ్వర్యంలో వైస్‌చైర్‌పర్సన్‌ ఆసియా షాహిన్‌ రియాజ్‌ మీర్జా, కౌన్సిలర్లు గుంటోజు పావని, నల్లెల్ల స్వాతి, ఎండి,కుతుబుద్దీన్‌, కెశెట్టి నవీన్‌, సిలువేరు సాంబయ్య కలెక్టర్‌ దివాకర, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సత్కరించారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక
1
1/2

రాష్ట్రస్థాయికి ఎంపిక

రాష్ట్రస్థాయికి ఎంపిక
2
2/2

రాష్ట్రస్థాయికి ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement