ద్విచక్ర వాహనాలు ఢీ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాలు ఢీ

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

ద్విచ

ద్విచక్ర వాహనాలు ఢీ

ద్విచక్ర వాహనాలు ఢీ ‘ముద్ర యోజన’ను సద్వినియోగం చేసుకోవాలి

ఇద్దరు యువకుల మృతి

భూపాలపల్లి రూరల్‌: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన భూపాలపల్లి మండలం కమలాపూర్‌ క్రాస్‌ భూపాలపల్లి కాటారం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన గాదె మహేష్‌ (29) భూపాలపల్లి పట్టణంలోని బంధువుల ఇంటికి ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరి నర్సింగాపూర్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. అదేక్రమంలో గణపురం గ్రామాణికి చెందిన రెబ్బ శ్రీకాంత్‌ (25) ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి వైపు వస్తున్న క్రమంలో కమలాపూర్‌ క్రాస్‌ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై సతీష్‌ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల గాదె మహేష్‌ భార్య సౌందర్య డెలివరి అయిందని, 19 రోజుల కూతురు ఉన్నట్లు బంధువులు రోదిస్తూ తెలిపారు.

ములుగు: పీఎం ముద్రయోజన పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జ నరల్‌ మేనేజర్‌ సిద్ధార్థ్‌ రెడ్డి పేర్కొన్నారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈడీసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారంటీ పత్రాలు లేకుండానే రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా పరిశ్రమ కేంద్రంలో సంప్రదించాలన్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీ1
1/1

ద్విచక్ర వాహనాలు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement