పవర్‌లిఫ్టింగ్‌లో జాఫర్‌కు గోల్డ్ మెడల్
కాజీపేట రూరల్: కాజీపేట రాంనగర్ (కడిపికొండ)కు చెందిన నేషనల్ ఐరన్ క్లబ్ జిమ్ కోచ్ కమ్ చైర్మన్ ఎండీ.జాఫర్ మాస్టర్ పంజాబ్ హరిద్వార్‌లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్‌ను కై వసం చేసుకున్నారు. 59 కేజీల విభాగంలో జరిగిన నేషనల్ పవర్‌లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో 317 1/2 కిలోల టోటల్ చేసి తెలంగాణ నుంచి జాఫర్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ను సాధించి రికార్డును బ్రేక్ చేశారు. ఈమేరకు తెలంగాణ నుంచి పాల్గొని గోల్డ్‌మెడల్‌ను సాధించిన జాఫర్‌ను పలువురు అభినందించారు. ఇప్పటి వరకు 15 నేషనల్ పవర్ లిఫ్టింగ్‌లో పాల్గొని విజయం సాధించినట్లు, ప్రపంచ ఇంటర్నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీలో పాల్గొని విజయం సాధిండమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని జాఫర్ వేడుకుంటున్నారు.


