లారీలతో ఇబ్బందులు
కాళేశ్వరం ఇసుక, సింగరేణి బొగ్గు లారీలతో పట్టణంలోని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నివారణకు మోరంచపల్లి నుంచి పట్టణంలోని బాంబులగడ్డ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.
–యాకయ్య, పట్టణవాసి
కోతుల బెడద లేకుండా చూడాలి
పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వాటి నివారణకు మున్సిపల్ అధికారులు, రాబోవు పాలకవర్గం తగు చర్యలు తీసుకోవాలి.
– కోల తిరుపతి,
వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించాలి
పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న షాపుల యజమానులు ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఆక్రమించారు. కాలినడకన వెళ్లే వారికి దారి లేక జాతీయ రహదారిపై నడవాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి.
–శ్రీనివాస్‌రెడ్డి,
వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు
లారీలతో ఇబ్బందులు
లారీలతో ఇబ్బందులు


