ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

ఎవరికో?

Feb 15 2026 7:34 AM | Updated on Feb 15 2026 7:34 AM

ఎవరిక

ఎవరికో?

మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభ పూజ నిర్వహిస్తున్న అర్చకులు

చైర్మన్‌

పీఠం

భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్ల క్యాంపులో, పట్టణంలో ఆ పీఠం ఎవరికి దక్కనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 16న జరగనున్న ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధం అవుతుండగా ఆశావహుల మధ్య పోటీ ఉత్కంఠను రేపుతోంది.

క్యాంపులో కౌన్సిలర్లు.. ఎమ్మెల్యే వ్యూహం

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి సీపీఐతో కలుపుకొని 17 వార్డు స్థానాలను కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన వార్డు సభ్యులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపకుండా, ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చాకచక్యంగా వ్యవహరించారు. ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ కౌన్సిలర్లు అందరినీ రహస్య క్యాంపునకు తరలించారు. చైర్మన్‌ ఎన్నిక రోజు వరకు వీరంతా ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే ఉండనున్నారు.

చైర్మన్‌ రేసులో ముగ్గురు కౌన్సిలర్లు..

మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు ఈ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2, 9, 19 వార్డుల నుంచి గెలుపొందిన బుర్ర కొమురయ్య, అప్పం కిషన్‌, కురిమిళ్ల శ్రీనివాస్‌ చైర్మన్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు. క్యాంపులో ఉన్న ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు ఈ ముగ్గురు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

వైస్‌ చైర్మన్‌కు తీవ్ర పోటీ..

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. చైర్మన్‌ స్థానాన్ని బీసీ పురుషుడికి ఇచ్చే అవకాశాలు ఉండటంతో వైస్‌ చైర్మన్‌ పదవిని మహిళలకు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. చైర్మన్‌ స్థానం బీసీలకు కేటాయించినందున వైస్‌ చైర్మన్‌ స్థానాన్ని అయినా తమకు అప్పగించాలని కొందరు ఓసీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరుతున్నట్లు తెలిసింది.

ఇంకా నిర్ణయానికి రాని ఎమ్మెల్యే..

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాల ఎంపిక విషయమై శనివారం రాత్రి వరకు కూడా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌ నాయకులతో చర్చించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎవరనేది తేల్చుకోనున్నట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి రాకుండా అందరిని కలుపుకుపోయే అభ్యర్థిని చైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారు కాకుండా కొత్త వారిని తెరపైకి తీసుకువస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే మనసులో ఎవరు ఉంటే వారే ఆ పీఠాలను అధిష్టించే అవకాశం ఉన్నందున, ఆయన ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది.

పట్టణానికా.. విలీన గ్రామాలకా.. ?

గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు విలీన గ్రామాలకు చెందిన వారే చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈసారి పట్టణానికి చెందిన వారికే పట్టం కడతారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా రేపు భూపాలపల్లి మున్సిపాలిటీ కొత్త సారథి ఎవరనేది తేలిపోనుంది.

కురిమిళ్ల శ్రీనివాస్‌

బుర్ర కొమురయ్య

కాంగ్రెస్‌ క్యాంపులో ముగ్గురి మధ్య పోటాపోటీ

వైస్‌ చైర్మన్‌ ఆశిస్తున్న పలువురు

ఎమ్మెల్యే సత్తన్న మదిలో ఎవరో..

రేపే మున్సిపల్‌ చైర్మన్‌,

వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ఎవరికో? 1
1/4

ఎవరికో?

ఎవరికో? 2
2/4

ఎవరికో?

ఎవరికో? 3
3/4

ఎవరికో?

ఎవరికో? 4
4/4

ఎవరికో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement