తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం

Feb 15 2026 7:34 AM | Updated on Feb 15 2026 7:34 AM

తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం

తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పూజారులు కడియం శ్రీహరి, కౌన్సిలర్లను అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement